తల్లాడ మండలంలో పెట్రోల్, డీజిల్ కొరతపై పుకార్లు వ్యాపించడంతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. కొత్తగూడెం రోడ్డులోని హెచ్పీ బంకు వద్ద డబ్బాలతో వినియోగదారులు క్యూ కట్టారు. కొన్నిచోట్ల 'నో స్టాక్' బోర్డులు దర్శనమివ్వడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వరి కోతలు, దుక్కుల సమయం కావడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.