కొణిజర్ల: పురుగు మందు తాగి మృతి

కొణిజర్ల మండలం కొండవనమాలకు చెందిన హరికొట్ల శ్రీను (24) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రీను, ఈనెల 9న వందనం గంగమ్మతల్లి దేవాలయం సమీపంలో పురుగుమందు సేవించాడు. ప్రేమించిన యువతి పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్నేహితులకు ఫోన్‌లో తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్