ఖమ్మం: పాముకాటుతో మహిళ మృతి

ఇంట్లో పనిచేసుకుంటున్న మహిళకు పాము కాటు వేయడంతో మృతి చెందింది. పెనుబల్లి మండలంలోని ముత్తగూడెంకు చెందిన గరిడి నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మి (35) సోమవారం ఇల్లు శుభ్రం చేస్తుండగా కాలి బొటన వేలిపై పాము కాటు వేసింది. దీంతో ఆమెను తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్