సత్తుపల్లి డిపోలో మహాలక్ష్మి పథకం సంబరాలు

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రూ. 10,000 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం సత్తుపల్లి బస్టాండ్‌లో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి, మహిళా ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. పథకం అమలుపై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్