ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని గుడిపాడు 1వ వార్డులో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి, మాజీ TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెహనా బేగం, కౌన్సిలర్ మట్టా ప్రసాద్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.