వైరాలో గణపతికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

వైరా మున్సిపాలిటీ 9వ వార్డు రాజశేఖర్ నగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సంక్షేమం, సుఖసంతోషాలు, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానికులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ  కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕