తల్లాడ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బిల్లుపాడు, రామచంద్రపురం, గొల్లగూడెం ప్రాంతాల్లో గురువారం అధికారులు అప్రమత్తమయ్యారు. వాగుల ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో రహదారులపై వాహనాలను అడ్డంగా ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. వాగులు, కల్వర్టులను దాటవద్దని తహసీల్దార్ కరుణాకర్‌రెడ్డి, ఎంపీవో శ్రీహరికృష్ణ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.