పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్ బస్టాండ్ లో గంజాయి కలిగిన వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక లంకపల్లికి చెందిన బోయిన వెంకటరమణ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి మండలంలోని పలు గ్రామాల్లో విక్రయిస్తున్నాడు. ఈమేరకు బస్టాండ్ లో చేపట్టిన తనిఖీల్లో ఆయన పట్టుబడగా 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్సై కె. వెంకటేష్ తెలిపారు.