పెనుబల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మంగళవారం అర్ధరాత్రి పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొనడంతో ఏలూరు జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణ (32), నవీన్ (30) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్