పెనుబల్లి: పాల వ్యాన్ లో మంటలు.. తప్పిన ప్రమాదం

పెనుబల్లిలోని గర్ల్స్ హాస్టల్ సమీపంలో పాలు తరలిస్తున్న వ్యాన్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. బ్రేక్ డ్రమ్స్ పట్టేయడంతో వెనుక చక్రాల వద్ద మంటలు వ్యాపించి, వ్యాన్ కొంత భాగం కాలిపోయింది. అదృష్టవశాత్తు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆర్పేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్