పెనుబల్లి: ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

పెనుబల్లి మండలంలోని లంక సాగర్ రిజర్వాయర్ కింద వరి సాగు చేసుకునే రైతుల కోసం కుడి ఎడమ కాలువల ద్వారా స్థానిక ఎమ్మెల్యే రాగమయి శుక్రవారం పూజా కార్యక్రమం నిర్వహించి, నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే నీటిని విడుదల చేయడం పట్ల రైతులు ఆనంద ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్