నేడు కల్లూరులో విద్యుత్ నిలిపివేత

కల్లూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఏఈ మహేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం, సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారికి కుడివైపున ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా ఈ కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్