అమిత్ షా వ్యాఖ్యలపై సత్తుపల్లిలో నిరసన

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం సత్తుపల్లి పట్టణంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రింగ్ సెంటర్ వద్ద అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, ప్రజలకు తక్షణమే ఆయన క్షమాపణ చెప్పడంతో పాటు పదవి నుంచి వైదొలగాలన్నారు.

సంబంధిత పోస్ట్