తల్లాడలో కొత్తగూడెం రోడ్డులో ఈ నెల 16న నిర్మించనున్న అయ్యప్ప స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని బుధవారం గ్రామ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావును అయ్యప్ప స్వామి పీఠం స్వాములు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో గురుస్వాములు ఈలప్రోలు లాలయ్య, అర్చకులు మణికంఠ శర్మ, బాలకృష్ణ స్వామి, పసుమర్తి కాశి స్వామి పాల్గొన్నారు.