చర్చి స్థలంలో పాస్టర్ ఇంటి నిర్మాణానికి సంఘ సభ్యులందరికీ అంగీకారమేనని దీనికి ఎవరి అభ్యంతరం లేదని సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్ క్రీస్తు సంఘం సభ్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 35 సంవత్సరాలుగా క్రీస్తు సంఘాన్ని నడిపిస్తున్న పాస్టర్ అలవాల కరుణాకర్ పై కొందరు చేస్తున్న అసభ్య ఆరోపనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు ఎం. అనీల్ కుమార్ పాల్గొన్నారు.