బీజేపీ 'సర్' పేరుతో ఓట్ల తొలగింపునకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. సత్తుపల్లిలో జరిగిన బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ కన్వీనర్ రవిచంద్రతో కలిసి వారు మాట్లాడారు. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లకు అవగాహన కల్పించాలని, ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని తెలిపారు.