సత్తుపల్లి: మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి

గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు చేస్తూ మరణించిన కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో సత్తుపల్లిలోని గ్రీన్ ఫీల్డ్ హైవే కంపెనీ వద్ద ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై రోజు వాటర్ క్యూరింగ్ చేయాలని, ఎర్రగుంటపాడు-యానాదులు కాలనీ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, మట్టి దోలుతున్న టిప్పర్లకు పట్టాలు కట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్