చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భవనాలు, ఆఫీసులు తగలబెట్టాలని, రైల్వే పట్టాలు కోసిపారేయాలని సింగరేణి కార్మికులను ప్రేరేపించేలా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల కాంగ్రెస్ నాయకులు గురువారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.