సత్తుపల్లి పట్టణంలోని బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు సామగ్రిని అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సహాయపడటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.