కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్తుపల్లి పట్టణంలోని పుల్లారెడ్డి బజార్లో చోటుచేసుకుంది. ఎస్సై కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నేల చిన్నరాజు (45) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం ఎస్ఐ తెలిపారు.