మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ బుధవారం పరిశీలించారు. పంట నష్టంపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నష్టాన్ని అంచనా వేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, కాంగ్రెస్ నాయకులు, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.