ముక్కోటి ఏకాదశి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డు నందు గల శ్రీవెంకటేశ్వర స్వామివారిని టీజీ ఐడిసి ఛైర్మన్ మువ్వా విజయబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్ధించినట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.