సత్తుపల్లి: చేతిలో చంటిబిడ్డతో వార్డు అభ్యర్థిగా నామినేషన్

సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తెనాలి మంజుల తన నెల రోజుల చంటిబిడ్డతో కలిసి 17వ వార్డు నుండి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు ప్రధాని మోడీ, బీజేపీ అంటే ఎంతో ఇష్టమని, ఆ ఇష్టం ముందు ఈ కష్టం ఏమీ కాదని తెలిపారు. మొత్తం 23 వార్డులకు గాను 22 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్