అప్పు చెల్లించే క్రమంలో ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో రంగంబంజర్ కు చెందిన పంచకర్ల శ్రీనివాసరావుకు సత్తుపల్లి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బీఎస్ఎమ్. సుమబాల ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి రూ. 4.5 లక్షలు చెల్లించాలని గురువారం తీర్పు ఇచ్చారు. కల్లూరుకు చెందిన సిద్దంశెట్టి మధుమోహన్ రావు వద్ద 2013లో శ్రీనివాసరావు రూ. 4 లక్షలు అప్పుగా తీసుకున్నారు. 2014లో రూ. 3 లక్షలకు ఇచ్చిన చెక్కు ఖాతాలో నగదు లేకపోవడంతో బౌన్స్ అయింది. దీనిపై సత్తుపల్లి కోర్టులో కేసు దాఖలైంది. విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది.