సత్తుపల్లి: బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ

దసరా పండుగ తర్వాత సొంత గ్రామాలకు వెళ్ళిన ప్రజలు తిరిగి తమ గమ్యస్థానాలకు బయలుదేరడంతో సోమవారం సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ బసాండ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అరకొరగా వస్తున్న బస్సులలో ప్రయాణించాల్సి రావడంతో, ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ ఫుట్ బోర్డులపై నిలబడి ప్రయాణించాల్సిన దుస్థితి ప్రజలకు ఏర్పడింది.

సంబంధిత పోస్ట్