ఖమ్మం జిల్లాలో సంచలనమైన పరారీ ఖైదీ పట్టుబడ్డాడు. మంగళవారం ఉదయం పరారైన రిమాండ్ ఖైదీని సత్తుపల్లి సబ్ జైల్ పోలీసులు 3గంటలలో పట్టుకున్నారు. అశ్వారావుపేటకు చెందిన పెండ్ర రమేష్ గతనెల 3న సత్తుపల్లి సబ్ జైల్ కు భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రిమాండ్ ఖైదీగా వచ్చాడు. ఈ క్రమంలో గోడదూకి పరారైన రమేశ్ ను ఏపీ రాష్ట్రం చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో పట్టుకున్నట్లు సబ్ జైల్ అధికారి జీ. వెంకటేశ్వరావు తెలిపారు.