సత్తుపల్లి: పెండింగ్ బకాయిలు చెల్లించాలని నిరసన

శనివారం సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు నిరసన చేపట్టారు. 2017, 2021 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు ప్రభుత్వంతో పాటు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సంస్థ అభివృద్ధికి ఎన్నో ఏళ్లు సేవలందించిన విశ్రాంత ఉద్యోగుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని సంఘం ప్రతినిధులు కోరారు.

సంబంధిత పోస్ట్