సత్తుపల్లి: 'పనితో పాటు ప్రజారోగ్యం ముఖ్యం'

సత్తుపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగుపర్చడం ముఖ్యమని మున్సిపల్ కమిషనర్ కే. నరసింహా, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ అన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా గంగారం PHC ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, డెంగీ, మలేరియా, జ్వరాలు రాకుండా నీటి నిల్వల వద్ద ఆయిల్ బాల్స్ వేస్తున్నామని వివరించారు.

సంబంధిత పోస్ట్