సత్తుపల్లి: తాళ్లమడ వద్ద రోడ్డు ప్రమాదం

ఆంధ్రాలోని చింతలపూడి మండలం రాఘవపురానికి చెందిన పి. వెంకటేశ్వరరావు బైక్ పై సత్తుపల్లికి వెళ్తున్నాడు. తాళ్లమడ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన టీవీఎస్ మోపెడ్ తో ఓ వ్యక్తి వెంకటేశ్వరరావును ఢీకొన్నాడు. అదే సమయంలో జాతీయ రహదారిపై అజాగ్రత్తగా నిలిపి ఉంచిన లారీ కిందకు దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరావు చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలవగా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్