తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు టీజీఎస్ ఆర్టీసీ ఉమ్మడి జిల్లాలోని అన్ని రూట్లలో బస్సులు నడుపుతూ భక్తులను గమ్యస్థానాలకు చేరవేస్తుందని ఖమ్మం ఆర్ఎం ఏ. సరిరాం తెలిపారు. మేడారం జాతరలో సేవలందిస్తున్న సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఉద్యోగులతో ఆయన సమావేశమై, ఏటూరునాగారం పాయింట్ వద్ద సేవలందిస్తున్న వాలంటీర్లకు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా పనిచేయాలని ఆయన సూచించారు.