సత్తుపల్లి: సొసైటీ చైర్మన్ కృష్ణయ్య మృతి

సత్తుపల్లి మండలం కిష్టారం సొసైటీ ఛైర్మన్, మాజీ సర్పంచ్ మామిళ్లపల్లి కృష్ణయ్య(80) శనివారం అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అనుచరుడిగా కృష్ణయ్యకు పేరుంది. ఆయన మృతిపట్ల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే మట్టా రాగమయి సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్