సత్తుపల్లి: రోడ్డు ప్రమాదంలో టీచర్ కు తీవ్ర గాయాలు

చండ్రుగొండ మండలం ఎర్రగుంటకు చెందిన అగ్గి రవి అనే ఉపాధ్యాయుడు సత్తుపల్లి నుంచి కిష్టారం వైపు వెళ్తున్నాడు. పట్టణ శివారులోని వెంగళరావు నగర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవిని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్