రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని AITUC జిల్లా ఉపాధ్యక్షుడు దండు రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం AITUC ఆధ్వర్యంలో సత్తుపల్లి మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీ ప్రకారం కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు.