సత్తుపల్లి: 'విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకుంటాం'

విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకొని తీరుతామని ట్రాన్స్ కో సత్తుపల్లి డివిజనల్ ఇంజినీర్ రాములు నాయక్ తెలిపారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం సత్తుపల్లి విద్యుత్ శాఖ ఉద్యోగులు సత్తుపల్లి డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో పాటు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్