గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ డెవలప్మెంట్ కమిటీ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గంగారం ఎంపీపీ ఎస్ హెచ్ డబ్ల్యూ స్కూల్లో గురువులను ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు ఎ. సాంబశివరావు, ఉపాధ్యాయిని డి. లావణ్య, అంగన్‌వాడీ టీచర్ ఎస్.కె. సకీనాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిన్నారులకు స్వీట్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు.