సత్తుపల్లి: కోతుల బెడద నుంచి కాపాడండి... మహాప్రభో!

సత్తుపల్లిలోని రెండో వార్డు అయ్యగారిపేట, మారుతి నగర్ ప్రాంతాల్లో కోతుల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించి, కోతుల బెడదను అరికట్టాలని కోరుతూ స్థానికులు మంగళవారం సంతకాల సేకరణ చేపట్టి, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గత మూడేళ్లలో 7750 మందిపై కుక్కలు, కోతులు దాడులు చేశాయని, తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్