సత్తుపల్లి రింగ్ సెంటర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకర్లపల్లి గ్రామానికి చెందిన పొదిలి నారాయణరావు (59) అనే చిరువ్యాపారి మృతి చెందారు. ఫ్యాన్సీ వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగించే ఆయన, పని నిమిత్తం సత్తుపల్లి వచ్చి, వాహనాన్ని వెనక్కి తీస్తుండగా ఖమ్మం వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించారు.