తల్లాడ: 200 కట్టల వరిగడ్డి వాము దగ్ధం

తల్లాడ మండలంలోని రామచంద్రాపురంలో గేదెల వద్ద దోమల నివారణకు పెట్టిన నిప్పురవ్వలు ఎగిసిపడి తూము వెంకటనరసయ్యకు చెందిన సుమారు 200 కట్టల వరిగడ్డి వాము దగ్ధమైంది. వైరా నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే గడ్డి కాలిపోయింది. అయితే, సమీపంలో ఉన్న ఇతర గడ్డి వాములకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి నిలువరించారు.

సంబంధిత పోస్ట్