ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న 6. 64 క్వింటాళ్ల గంజాయిని సోమవారం తల్లాడ మండలం గోపాలపేటలో ఏడబ్ల్యూఎం బర్నింగ్ ప్లాంట్లో దహనం చేయించారు. ఖమ్మం జిల్లాలో పట్టుబడిన 1. 82 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో 4. 82 క్వింటాళ్ల గంజాయి ఇందులో ఉందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.