తల్లాడ: కోడి పందాలు.. ఎనిమిది మందిపై కేసులు

తల్లాడ మండల పరిధిలోని పినపాక గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1500 నగదు, 2 పందెం కోళ్లు, 5 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. కోడి పందాలను అరికట్టడానికి నిరంతర నిఘా ఉంచి, పండుగల సమయంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్