గొడవ పడిన తన కుమారుడు భోజనం పెట్టలేదంటూ ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన చల్లా తిరపతమ్మకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరి వివాహాలు జరగగా కుమారుడైన చల్లా అశోక్ (తంబి) వద్ద ఆమె ఉంటోంది. అయితే, గురువారం తల్లితో గొడవపడిన ఆయన భోజనం పెట్టకపోవడంతో తిరపతమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు అశోక్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.