బిల్లుపాడు గ్రామానికి చెందిన హోంగార్డ్ ఉమ్మడి రఘుపతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల నేతలు గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.