తల్లాడ మండలం గొల్లగూడెంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ఏఈఓ, సొసైటీ సీఈఓలతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. జిల్లా మంత్రులు హెలీకాప్టర్లలో తిరగడం ఆపేసి భూమిని నమ్ముకున్న రైతుల కోసం దిగిరావాలని సూచించారు. పంట నష్టపోయిన వారికి ఎకరాకు రూ. 20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని సండ్ర డిమాండ్ చేశారు.