కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని న్యాయవాద కోర్సుల్లో తల్లాడ మండలానికి చెందిన నూతనకల్లు గ్రామస్తుడు కళ్యాణపు మధు ఈ నెల 9న రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీపీఎం నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, అయినాల రామలింగేశ్వరరావు సత్కారం చేశారు. పేదల కోసం న్యాయవాదిగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, మోహన్ రావు, పకిరమ్మ, ప్రకాష్ పాల్గొన్నారు.