తల్లాడ మండలం మేజర్ గ్రామ పంచాయతీ, గుండ్ల రాజేష్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న పోట్రు లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ప్రవీణ్ కిరణ్ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య ఆదేశానుసారం కుటుంబానికి శుక్రవారం రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడ్డం వీరమోహన్ రెడ్డి, దుర్గిదేవర వెంకటలాల్, సంఘసాని శ్రీను, తదితర నాయకులు పాల్గొన్నారు.