తల్లాడ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన సూదా భద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించినారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, శనివారం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వీర మోహనరెడ్డి, బాలపేట మాజీ సర్పంచ్ కోసూరి వెంకట నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.