తల్లాడ: శ్మశానవాటిక లేక గ్రామస్థుల తీవ్ర ఇబ్బందులు

తల్లాడ మండలం బలంపేటలో వైకుంఠధామం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్మశాన వాటిక లేక ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు అవస్థలు పడుతున్నారు. వాగులు, పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే పొలాల గుండా వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే శ్మశానవాటిక నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్