తల్లాడలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నూతన కమిటీ ఎన్నిక

ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తల్లాడ మండల నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ఎస్ రెడ్డి, సత్తుపల్లి డివిజన్ అధ్యక్షుడు అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో బోడ శ్రీను మండల అధ్యక్షుడిగా, కోడూరు వీరకృష్ణ ఉపాధ్యక్షుడిగా దిరిశాల వీరభద్రం కార్యదర్శిగా, తేల్లాపుట్ట వెంకటనారాయణ కోశాధికారిగా, షేక్ మెహారాజ్ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన కమిటీ సభ్యులకు నాయకులు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕