సాగర్ కాలువకు పడిన గండ్లను వెంటనే పూడ్చాలి

సాగర్ కాల్వకు త్వరగా మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు అన్నారు. శనివారం కల్లూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఆర్డీఓ వరకు బీజేపీ నాయకులు ర్యాలీగా వెళ్లి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గండ్లు పూడ్చకపోవడంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయన్నారు. సాగర్ కాలువకు పడిన గండ్లను వెంటనే పూడ్చాలని, ఎండుతున్న వరి పంటలకు నీరు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్