కొత్త రేషన్ కార్డుల జారీతో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు కడుపునిండా సన్నబియ్యంతో అన్నం పెడుతుందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. గురువారం వైరా మండల రైతు వేదిక నందు అర్హులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తాహశీల్దార్ శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదునూరి సీతారాములు, టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, మార్క్ ఫైడ్, వైస్ చైర్మన్ బోర్ర రాజశేఖర్ పాల్గొన్నారు.